Monday, September 22, 2008

రుణాలు

పావలా వడ్డీకే రుణాలు
పేదవాడి ఆశల తోరణాలు
జబ్బు దాచుకుంటాడు కాని
డబ్బు దాచుకోడు మన పేదోడు
పక్కనుంది గవర్నమెంటు బారు
అందులో మట్కాలు , జల్సాలు
ఇంట్లో ఆడది బేజారు

వస్తున్నాయ్ ఎన్నికల చక్రాలు సారా పొట్లాలతో
పదండి తూలుతూ, పడుతూ లేస్తూ
మీట నొక్కుదాం పోలింగు బూతు లో
గొంతు నొక్కుదాం ఎవరిదో.

4 comments:

Aravind Bhimarasetty said...

chala baagundi ra ee kavitha

పరిమళం said...

బావున్నాయండీ ! మీ కవితలన్నీ !

BP said...

"వస్తున్నాయ్ ఎన్నికల చక్రాలు సారా పొట్లాలతో
పదండి తూలుతూ, పడుతూ లేస్తూ"
శ్రీశ్రీగారి "జగన్నాథ రథచక్రాలు" ని గుర్తుచేసింది. ఆయన మనసును కలచిన విషయాలు ఇప్పటి రోజువారి జీవితంలో సర్వసాధారణమవ్వడం మన దౌర్భాగ్యం. (తప్పు) మీటనొక్కి మన పీక మనమే నొక్కుకుంటున్నామన్న విషయాన్ని గ్రహించే మెలకువ ఎంతమందికుంటుందో?

Trinath Gaduparthi said...

@BP

శ్రీశ్రీ మహాప్రస్థానం చదివిన తరువాత ఉరికిన కవిత ఇది. దీనికి పలుగు తాడు లేదు.