Monday, June 1, 2009

ప్రజాస్వాములు

కొడుకులు బిడ్డలు కాసుకు లోనై
మూల గుడిసెలో, భోరు వర్షంలో
చలి వణుకులో, వదిలేసేరు
మూలుగుతున్న ప్రజాస్వామ్య ముసలమ్మను.
వచ్చేవాళ్ళూ, పొయ్యేవళ్ళూ
శ్మశాన సంబరం నిన్నటిదాకా.
కులాల కాకి లెక్కలు, మతాల మతలబులు
హోరెత్తించాయ్ ముసలమ్మ గుండెల్ని.
పచ్చనోట్ల గాంగ్రీనుతో నడవలెకున్న
ఆ ముదుసలి శరీరంపై నగల కోసం
కాచుకున్నారు కిరాయి రౌడీలు.
శవాల దిబ్బలో మతాబులు వెలిగించి
అదే వెలుగు అని చూపించే స్వాములు
మన ప్రజాస్వామ్య ఆసాములు.

3 comments:

BP said...

ఇంతకు ముందు చెప్పినట్టుగా:
(అ) ఇంటెర్నెట్లో తెలుగు కవితలు వ్రాసేవారు బహు తక్కువ
(ఆ) అదీ సోషల్ కమిట్మెంట్ తో కవతలు వ్రాసేవారిని వేళ్ళపై లెక్కించవచ్చేమో

ప్రజాస్వామ్య ముసలమ్మ అన్న భావుకత బావుంది.

"శవాల దిబ్బలో మతాబులు వెలిగించి
అదే వెలుగు అని చూపించే స్వాములు
మన ప్రజాస్వామ్య ఆసాములు."
ఈ మాటల్లో వున్న నిజం భయపెడుతోంది. కలవరానికి, ఆవేదనికి గురిచేస్తోంది.

"నడవలెకున్న", "నడువలేకున్న" అని వుండాలేమో?

BP said...

మన్నించాలి. నడవలేకున్న (ధీర్ఘము) అని వుండాలని. తొందరలో "నడువ" అని వ్రాసేను.

Trinath Gaduparthi said...

@BP
చాలా చాలా ధన్యవాదాలండీ. మళ్ళీ తప్పు, ఇదీ నా పైత్యమే !