Wednesday, July 29, 2009

స్కెప్టిక్

ఊదేసిన సిగరెట్టు
తాగేసిన పాకెట్టు
చిరిగిన జాకెట్టు
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇదే నా ప్రజాస్వామ్యం.
ఖూనీలే పెట్టుబడి
ఎర్రటి సిరాకి
లూటీలే పెట్టుబడి
తెల్లటి సారాకి.
ఎక్కడ విలువలు
ఎక్కడి విలువలు
ఈ చెడబుట్టిన శిలువలు
మన పూర్వుల మదిలో.
అవకాశం కోసం కాచుకుని
దిగబడ్డానికి సిద్ధంగా ఉన్న
పాత మేకులం మనం.
తుప్పుబట్టిన మోట్లతో
మన భవిష్యత్తంతా ఇక
సెప్టిక్, సెప్టిక్, సెప్టిక్.

2 comments:

BP said...

ఒక్క విషయానికి మాత్రం నీకు తప్పక నా ధన్యవాదాలు తెలపాలి. తెలుగు చదవదంలో వున్న హాయిని, సులువుని, నీ కవితలు గుర్తుచేసినందుకు.

"ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇదే నా ప్రజాస్వామ్యం"
చాలా బాగుంది, ఈ పద ప్రయోగం.

Trinath Gaduparthi said...

ప్రవీణ్,
ధన్యవాదాలు మీ ఈ విశ్లేషణకి . ఏదో తెలిసిన భాషలో నాలుగు ముక్కలు రాసుకోడానికే ఈ ప్రయత్నం!