Saturday, July 18, 2009

తిరుగుముఖం

కన్నె కన్నీటి చుక్కలు
మసక వెన్నెలలో మెరుస్తుంటే
గుండె బరువుగా వర్షంలో తడుస్తుంటే
ఎప్పుడో, ఎక్కడో
నువ్వు ఒదిలి వెళ్ళిన అమ్మ ఒడి
ఆ జోల సడి
తమని వెతుక్కోమంటాయ్
చేరుకోమంటాయ్
అన్నీ వదిలేసి, పెట్టెలు సర్దేసి
బయల్దేరుదాం అనుకుంటే
కనిపించని శృంఖలాలేవో
కనిపెంచిన శ్రమని గుర్తించనంటాయ్

2 comments:

BP said...

నీ కవితలలో అని వ్రాయాలని మొదలెట్టి, మీ కవితలలో అని వ్రాస్తున్నాను:
లయ చక్కగా కుదురుతోంది. పద ప్రయోగాలు అర్ధవంతంగా వున్నాయి.

"వెతుక్కోమంటాయ్", "చేరుకోమంటాయ్", "గుర్తించనంటాయ్", శ్రీశ్రీగారు మహాప్రస్థానంలో "తమలోతు కనుక్కోమంటాయ్" అని సాగే కవితని గుర్తుచేసాయి.

Trinath Gaduparthi said...

ప్రవీణ్,
దొరికిపోయాను ! ఆ పదప్రయోగాలన్నీ శ్రీశ్రీ గారివే. నేను కాపీ కొట్టాను.